నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …
Read More »పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …
Read More »ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు
కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..
Read More »తెలంగాణ బాటలో తమిళనాడు
పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.
Read More »హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు
కేరళ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అనుమానిత లక్షణాలున్నవారుంటే..వాళ్లు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని నిర్ణయించింది. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆస్పత్రిలో చేరాల్సిందేనని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైలజ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు …
Read More »వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో …
Read More »జర్నలిస్టులకు అండగా కమల్ హసన్
కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్‌లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి …
Read More »తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకూ రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం- గ్రీన్ లేదు రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో
తెలంగాణలో మొత్తం ?1096 మందికి పాజిటివ్ ?628 డిఛార్జి అయ్యారు ?439 ట్రీట్ మెంటు లో ఉన్నారు. ? వైరస్ ను చాలా పకడ్బందీగా ఎదుర్కొంటున్నాం ? కరీంనగర్ నుంచి కట్టడి ఎలా చేయాలని పాఠాలు నేర్చుకున్నాం ? మృతుల సంఖ్య 2.4 గా ఉంది ? రికవరీ రేటు 57.5 గా ఉంది ? వైరస్ కట్టడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ? వైరస్ నిరోధానికి వ్యాక్సిన్ …
Read More »కానిస్టేబుల్ ఔదార్యం
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని చైతన్యపురి స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పల్లె శివకుమార్ తన నెల రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిది (సి ఎం ఆర్ ఎఫ్ )కి అందజేశారు. ఈ మేరకు ఇరవై వేల రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ కి సోమవారం నాడు లక్డీకాపూల్ లోని హోంమంత్రి కార్యాలయంలో అందించారు. శివకుమార్ ను ఈ సందర్బంగా హోంమంత్రి అభినందించారు.
Read More »