కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
Read More »భారత్‌లో 18లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 18 లక్షలు దాటింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా…771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది …
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాకి కరోనా
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ గా తేలింది. డాక్టర్ల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్లు అమిత్ షా తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు ఐసోలేషన్లో ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1891 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది.. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,547కి చేరింది. ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. మొత్తం 47,590 మంది వైరస్ నుంచి కోలుకున్నారు ..గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 19,202 టెస్టులు చేయగా మొత్తం …
Read More »కరోనాతో యూపీ మంత్రి మృతి
కరోనా మహమ్మారికి సామాన్యులతో పాటు రాజకీయ నేతలు బలవుతున్నారు. తాజాగా యూపీ మంత్రి కమలా రాణి(62) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. కరోనా బారిన పడటంతో గత నెల 18న చికిత్స కోసం లక్నోలోని రాజధాని కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. ఇటు మంత్రి మృతితో అయోధ్య పర్యటనను సీఎం యోగి రద్దు చేసుకున్నారు.
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 521 పాజిటివ్‌లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 289, మేడ్చల్‌లో 151, వరంగల్ అర్బన్‌లో 102 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 97, నల్లగొండలో 61, నిజామాబాద్‌లో 44, మహబూబ్‌నగర్‌లో 41, మహబూబాబాద్‌లో 39, సూర్యాపేటలో 37, సంగారెడ్డిలో 33, సిరిసిల్లలో 30, గద్వాలలో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 27గా నమోదయ్యాయి. ఖమ్మంలో 26, సిద్దిపేటలో 24, వనపర్తిలో 23, జనగామలో 22, …
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని
28.07.2020న తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి ?రాష్ట్రంలో న కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 58906 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 492 మంది ?డిశ్చార్జ్ అయినవారు 43751 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 14663
Read More »తెలంగాణలో కరోనా కేసులెన్ని..?
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1610 కొత్త కేసులు వెలుగు చూశాయి. 9 మందివైరస్ వల్ల ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరగా 42,909 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.మొత్తం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 480 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఇటు ఒక్క GHMC పరిధిలోనే 531 కొత్త కేసులు వెలుగు చూశాయి.
Read More »ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం
ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.
Read More »