అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించగా నాగ్‌పూర్‌లోని దవాఖానకు తరలించారు. నవనీత్ కౌర్ సహా కుటుంబంలోని 12 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల ఆమె పాజిటివ్‌గా పరీక్షించడంతో చికిత్స కోసం అమరావతి దవాఖానలో చేరారు. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో నాగ్‌పూర్‌లోని ఓఖార్డ్ హాస్పిటల్‌లో చేరారు. నవనీత్ కౌర్ భర్త రవి రానాకు ఆగస్టు 6న కరోనా పాజిటివ్‌గా తేలింది. తరువాత కుటుంబంలోని …
Read More »తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది… కాస్త తగ్గినట్టుగానే అనిపించిన కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,897 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.. ఇదే సమయంలో 9 మంది మృతి చెందారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేరగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య …
Read More »తెలంగాణలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి.. కేంద్ర ప్రభుత్వ బృందం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయి అని కేంద్ర ప్రభుత్వ బృందం మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు టెలి మెడిసన్ సేవలు, వారి పర్వవేక్షణను చేపట్టడానికి వినూత్న పద్దతిలో హితం ఆప్ ను ప్రవేశ పెట్టినందుకు నీతి ఆయోగ్ సభ్యులు డా. వినోద్ కుమార్ పాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. డా.పాల్ , కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తీ …
Read More »తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,647కు చేరుకోగా…645 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 22,628 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో …
Read More »తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 389 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 637కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 11,609 …
Read More »రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?
లాక్‌డౌన్ సమయంలోను వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై తనదైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ సదరు వెబ్‌సైట్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వరం …
Read More »దేశంలో 22లక్షలు దాటిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు …
Read More »మాస్కులు లేకపోతే జరిమానే
కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు లేకుండా తిరిగితే ఎవరినీ ఉపేక్షించవద్దని.. జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శనివారం పాలకుర్తికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయా అంశాలపై చర్చించిన మంత్రి.. సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. క రోనా నియంత్రణకు ఏ ఊరికి ఊరు ప్రజాప్రతినిధులు, …
Read More »అభిమానులకు,ప్రజలకు మహేష్ పిలుపు
కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రజలకు ప్లాస్మా దానం చేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారాయన. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న …
Read More »