నిన్న మొన్నటి వరకు కరోనాతో ఆగమాగమైన యావత్ ప్రపంచం తాజాగా బ్రిటన్ లో చోటు చేసుకున్న స్ట్రెయిన్ కరోనాతో ఆగమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తాజాగా ఆ కరోనా లక్షణాలు ఉన్న ఏపీకి చెందిన ఒక మహిళ క్వారంటైన్ నుండి తప్పించుకుని రాజమండ్రికి చేరుకోవడంతో అక్కడ కాస్త గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికి అది సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడమే మనముందు ఉన్న ప్రధాన కర్తవ్యం. అసలు ఈ వ్యాధి …
Read More »బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వెర్షన్
బ‌్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం …
Read More »మంత్రి పువ్వాడకు కరోనా
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం మంత్రి పువ్వాడకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. తనను కలిసినవారు, తనతో వివిధ కార్యక్రమాల్లో సన్నిహితంగా మెలిగిన ప్రతిఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.
Read More »జనవరి నుండి కరోనా టీకాలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్‌వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ …
Read More »కరోనాతో అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. అక్టోబర్ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారు. ఈమేరకు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాంగాధీకి ఆయన సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 857 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,51,188కి చేరింది ఇందులో 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,30,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నలుగురు మృతిచెందగా.. కరోనా మృతుల సంఖ్య 1,381కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 250 కేసులు వచ్చాయి.
Read More »దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. ఇందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 490 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 1,26,611 మంది వైరస్ తో మృతి చెందారు
Read More »తెలంగాణలో 1,440 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత గడిచిన 24 గంటల్లో 42,673 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,440 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,50,331కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1377కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క …
Read More »కరోనా సమయంలో రూ. 52,750 కోట్ల ఆదాయ నష్టం
కరోనా, లాక్‌డౌన్ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారు. రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక …
Read More »తెలంగాణలో 1,607 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,607 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. 1,372 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,27,583 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ …
Read More »