తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి మరో 51 మంది మరణించారు. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా.. 6,361 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో …
Read More »ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’
ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయించాలని చెప్పారు.. సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి …
Read More »ఏపీ,తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం ఇదే..?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.
Read More »తెలంగాణలో మరో ఇంటింటి సర్వే
కరోనాతో పోరులో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటు చేసింది. వీరు కరోనా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.
Read More »అమిత్ మిశ్రాకి కరోనా
ఐపీఎల్ 2021ను కరోనా వాయిదా వేయించింది. ఆటగాళ్లలో వరసగా కేసులు వస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా పాజిటివ్ గా తేలాడు. నిన్న సాయంత్రం చేసిన టెస్టులో మిశ్రాకు పాజిటివ్ వచ్చింది. రెండురోజుల వ్యవధిలో కరోనా సోకిన నాల్గవ ప్లేయర్ అమిత్ మిశ్రా. DC క్యాంపులో ఇది తొలి కరోనా కేసు.
Read More »దీపికా పదుకొణెకి కరోనా
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కరోనా బారినపడింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పుట్టింట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీపిక కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆమె తండ్రి, మాజీ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు జ్వరం తగ్గకపోవడం వల్ల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read More »కరోనాను జయించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన RT-PCR టెస్టులో సీఎంకు కరోనా నెగిటివ్ రాగా.. ఆయన ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల సీఎంకు నిర్వహించిన RT-PCR టెస్టులో ఫలితం వెలువడకపోగా, తాజాగా మరోసారి టెస్టు చేశారు. కాగా ఏప్రిల్ 19న కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.
Read More »హెర్బల్ టీ తాగితే..?
ఒంట్లోని మలినాలను తొలగించడం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకోసం హెర్బల్ టీ తాగితే చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ తాగితే అజీర్తి, ఇతర సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ధనియాలు, సోంపు.. నీళ్లలో వేసి మరిగించాలి. ఈ హెర్బల్ టీని వడబోసుకొని వేడిగా తాగేయాలి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వాపు, గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
Read More »దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.
మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …
Read More »