ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి మేఘా ముందుకు
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను …
Read More »తమిళనాడులో లాక్డౌన్
ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …
Read More »మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా
కివీస్ వికెట్ కీపర్.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు టిమ్ సైఫెర్ట్ కరోనా బారిన పడ్డాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్ విమానంలో భారత్ విడిచి న్యూజిలాండ్ వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని విమానం ఎక్కించకుండా క్వారంటైన్లోకి తరలించారు. కొవిడ్ నెగిటివ్ వచ్చాక సైఫెర్ట్ను న్యూజిలాండ్ పంపిస్తారు. ఇక ఐపీఎల్ లో …
Read More »కంగనా రనౌత్ కి కరోనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.
Read More »తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.
Read More »18ఏళ్ల పైబడినవారికి ఎప్పుడంటే టీకా.?
తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది. ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.
Read More »ఈ కరోనా లక్షణాలుంటే..?
కరోనా విషయంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలన్నారు. 1. ముఖం, పెదవులు, గోర్లు నీలి రంగులోకి మారడం 2. ఛాతిలో నొప్పి అనిపించడం 3. ఆయాసం, శ్వాస సమస్యలు 4. దగ్గు ఎక్కువ కావడం 5. అలసట ఎక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.
Read More »తెలంగాణలో ఈ నెల 15 వరకు కొవిడ్ టీకా మొదటి డోసు నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయంఈ నెల 15 వరకు కొవిడ్ టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉంది.రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారు.మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Read More »తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు ప్రభుత్వ దవాఖానలు టిమ్స్, గచ్చిబౌలి – 9494902900 గాంధీ హాస్పిటల్ – 9392249569, …
Read More »