తెలంగాణ రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »తెలంగాణలో కొత్తగా 3,892 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. మరో 27 కోవిడ్-19 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 5,186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 607, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ 225 కరోనా కేసులు …
Read More »ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం
కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలబడుతున్న హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ సామాన్యులకే కాదు సర్కారులకు సాయం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో 2 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని సోనూ స్నేహితులు తమ జిల్లాకు ఏమైనా సాయం చేయాలని కోరారు. అవసరాలు ఏంటో చెప్పండని కోరగా వారు కలెక్టర్ చక్రధర్ బాబుతో మాట్లాడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ …
Read More »నేడే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమా
కరోనా కాలంలో గంగపుత్రులను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ YSR మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా ఈ పథకానికి రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ జగన్ సర్కార్ సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చేపల వేటను నిషేధించిన టైంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో ఫ్యామిలీకి.. ఈ స్కీమ్ ద్వారా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Read More »తెలంగాణలో ఆక్సిజన్ కొరత రావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 …
Read More »భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు
భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్
కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.
Read More »ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.
Read More »COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ
■ COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ | ■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. > లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. > 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా …
Read More »తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50,969 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 658, రంగారెడ్డి 326, మేడ్చల్ 293, కరోనా కేసులు బయటపడ్డాయి. తెలంగానలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Read More »