స్విట్జర్లాండ్‌లో ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమయింది. ఫైజర్ బయోఎన్‌టెక్ తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్ మెడిసిన్స్ ఏజెన్సీ స్విస్‌మెడిక్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్ గ్రూప్‌వారికి టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్, కెనడా, అమెరికా దేశాలు ఈ ఏజ్ గ్రూప్ చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌కు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీలో మరో మైలురాయి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ …
Read More »దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో 3,40,97,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,111 మంది మరణించగా, 94,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది. …
Read More »కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన బిల్ గేట్స్
కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేశారు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్ర దశ ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఆందోళన పరిస్థితి తప్పదన్నారు. ఈ దశలో మరో సంక్షోభాన్ని అంచనా వేయలేమని, కానీ మహమ్మారికి చెందిన తీవ్ర దశ వచ్చే ఏడాది ముగియనున్నట్లు ఆయన తెలిపారు. గేట్స్ …
Read More »బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయ తాండవం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కొవిడ్ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్ కట్టడికి మరిన్ని …
Read More »దేశంలో కొత్తగా 8,439 కరోనా కేసులు
దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 195 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 …
Read More »ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదమా..?
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీలక అంశాన్ని వెల్లడించారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ విధ్వంసకరమైంది ఏమీకాదన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై …
Read More »ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధరించకపోతే రూ. 1,000 జరిమానా
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ 35 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కు ధరించకపోతే నేటి నుంచి పోలీసులు …
Read More »టీకాలు తీసుకోని వరకు కేరళ షాక్
కేరళలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగా వస్తుండటంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారినపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యంతో వ్యాక్సిన్ వేసుకోనివారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.
Read More »కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా అనుమతివ్వండి
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీరం సంస్థ భారత డ్రగ్ నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు చేసుకున్నది. తమ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐని కోరింది. తమ వద్ద కావాల్సినన్ని టీకాలు నిలువ ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దడ …
Read More »