తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి నిన్న కరోనా నిర్ధారణ అయిన సంగతి తెల్సిందే..ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృంద ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఎర్రబెల్లి, రంజిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో అధికార పార్టీ …
Read More »తెలంగాణలో మరో 3ఒమిక్రాన్ కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4450 పెరిగింది. ఇప్పటివరకు 10 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Read More »ఒమిక్రాన్ గురించి Good News
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ పై ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మన దేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90% మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేశ్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చినా త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 415 ఒమిక్రాన్ కేసులు …
Read More »వడివేలుకు కరోనా
ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలుకు కరోనా సోకింది. ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే వడివేలు లండన్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఒమిక్రాన్ వేరియంట్ బారినపడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వడివేలు నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
Read More »మంత్రి ఎర్రబెల్లి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »ఒమిక్రాన్ వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు గారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయని, ఆ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్‌రావు శుక్రవారం …
Read More »రాజన్న సిరిసిల్ల లో ఒమిక్రాన్ కలవరం
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 78,291 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 139.70 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ జరిగింది. …
Read More »డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి
డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్ను తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోట్టీ అన్నారు. తాను ఇప్పటివరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశానని, సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. కాగా, కోట్టీ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించి ఆ దేశ వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.
Read More »