ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 979 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,873 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు
Read More »ఒమిక్రాన్ బారినపడి 108 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడి 108 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4,70,462 ఒమిన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యూకేలో అత్యధికంగా 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, డెన్మార్క్ 57,125, USA 42,539, జర్మనీలో 35,529 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించింది. కాగా దేశంలో ప్రస్తుతం 2,135 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
Read More »తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,531 టెస్టులు చేయగా 1,520 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్నటితో (1,052) పోలిస్తే ఏకంగా 500 కేసులు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులుండగా, కరోనాతో ఒకరు మరణించారు. అయితే ఇవాళ ఒమిక్రాన్ కేసులేవీ రాలేదని వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఒమిక్రాన్ …
Read More »మహారాష్ట్రలో ఒమిక్రాన్ భయోత్పాతం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ భయోత్పాతం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 144 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒక్క ముంబైలోనే 100 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 96.55శాతానికి తగ్గింది.
Read More »దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం
దేశంలో రోజు రోజుకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదయింది. రాజస్థాన్లో ఒమిక్రాన్ సోకిన 72ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బాధితుడు ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు రాగా.. అది ఒమిక్రాన్ మరణం కాదని తేలింది.
Read More »మీనా కుటుంబంలో కరోనా కలవరం
ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతూగిలించిన మోస్ట్ బ్యూటీఫుల్ లేడీ..అలనాటి హీరోయిన్ మీనా ఇంట్లో కరోనా ఆందోళన నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మీనా స్వయంగా వెల్లడించింది. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటికి అతిథిగా కరోనా వచ్చింది. దానికి మా కుటుంబం బాగా నచ్చింది. అయితే.. దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా కేర్ఫుల్గా ఉండండి. కరోనా జాగ్రత్తలు పాటించండి’ …
Read More »బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం
బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు రేణూ దేవీ, తారా ప్రసాద్ సహా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరిలకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పంజాబ్లోను కరోనా విలయతాండవం చేస్తోంది. శిరోమణి ఆకాలిదళ్ అధ్యక్షుడు సుఖేవ్ సింగ్ ధిండా కరోనా బారిన పడ్డారు.
Read More »ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు
ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ మహిళతో పాటు ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులకు ఒమిక్రాన్ వచ్చింది. USA నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
Read More »అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేగుతోంది. ముంబైలోని అమితాబ్ నివాసంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిగ్ బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది జూలై 11న అమితాబ్ కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఇంట్లో మరోసారి …
Read More »