దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 …
Read More »ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76వేలు దాటాయి.
Read More »మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో 2,956 మందికి వైరస్ సోకగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే 1,724 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 18వేలు దాటాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,118 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 3వేలు దాటాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 219 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా టెస్టులు చేశారు.. ఇందులో కొత్తగా 219 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా.. తాజా కేసుల్లో 164 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 8,822 మందికి కరోనా వైరస్
భారత్ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా గడిచిన గత 24గంటల వ్యవధిలో 8,822 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే (6,594) పోలిస్తే ఈ రోజు 2,298 కేసులు పెరిగాయి. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 …
Read More »కరోనాపై శుభవార్త
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(8,084) పోలిస్తే ఈ రోజు 1490 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైరస్ నుంచి 4,035 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.
Read More »గవర్నర్ కు సీఎం జగన్ పరామర్శ
ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.
Read More »దేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343 మంది వైరస్లో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. మరోవైపు తాజాగా 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.
Read More »