రష్యా, జర్మనీతోపాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనాబారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
Read More »దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు
దేశంలో గడచిన 24 గంటల్లో 10,126 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,43,77,113కు చేరింది. తాజాగా 332 మంది వైరస్లో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,61,389గా ఉంది. ఇక కొత్తగా 11,982 మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,37,75,086గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,40,638 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఇప్పటివరకు 109,08,16,356 వ్యాక్సిన్ డోసులు …
Read More »దేశంలో కొత్తగా 11,451 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 11,451 కొత్త కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 266 మంది బాధితులు వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. యాక్టివ్ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నది.మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.42శాతం మాత్రమే ఉన్నాయని.. రికవరీ రేటు …
Read More »కొవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్
దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్సిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతి లభించింది!! అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థలతో పోటీ పడి.. వారికి దీటుగా అత్యంత వేగంగా టీకా తయారుచేసినా రకరకాల రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా లభించని డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఎట్టకేలకు పండగ వేళ లభించింది. బుధవారంనాడు సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ‘సాంకేతిక సలహాదారుల బృందం’.. ఈ టీకాకు ‘ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్’ …
Read More »దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కు చేరింది. ఇందులో 1,51,209 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 252 రోజుల్లో ఇదే అతితక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, మొత్తం కేసుల్లో 3,36,97,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, మరో 4,59,191 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. గత 24 గంటల్లో 311 మంది మరణించగా, 14,159 మంది …
Read More »ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా
ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్ చేశారు.
Read More »దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ …
Read More »రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలి
కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ రైజ్‌హోమ్ కాలనీలో శనివారం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కొవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ పూర్తయ్యిందని చెప్పారు. శనివారం నుంచి …
Read More »దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,42,73,300కు చేరాయి. ఇందులో 3,36,55,842 మంది బాధితులు కోలుకోగా, 4,58,186 మంది వైరస్ వల్ల మరణించారు. మరో 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 247 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్ కేసులు ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 7427 కేసులు, 62 మరణాలు …
Read More »పెరూలో కోవిడ్ వల్ల రెండు లక్షలు మంది మృతి
లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు లక్షలు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 25 మంది మరణించారు. దీంతో దక్షిణ అమెరికా దేశమైన పెరూలో మృతుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మార్చి 2020 నుంచి ఆ దేశం కరోనా మరణాలను లెక్కిస్తున్నది. ఆ దేశంలో ఇప్పటి వరకు 22 …
Read More »