తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్)పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలతో ప్రజలు రిస్క్ ఎందుకని టీకా కేంద్రాలకు పరిగెత్తుతున్నారు. గత 2 రోజులుగా రెండో డోసు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
Read More »హడలెత్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్
కరోనా కొత్త వేరియంట్ B.1.1.529 మళ్లీ హడలెత్తిస్తోంది. యువతపై ఎక్కువ ప్రభావమని శాస్త్రవేత్తలు చెప్పడం వణికిస్తోంది. దీని స్పైక్ ప్రొటీన్లోనే 30కిపైగా మ్యుటేషన్లు గుర్తించారు. డెల్టా, డెల్టా ప్లస్లలో 2-3 ఉండేవి. వ్యాక్సిన్లు ఈ వేరియంట్పై ఎలా పనిచేస్తాయనే క్లారిటీ లేదు. WHO దీనికి ‘ఒమిక్రాన్’ పేరు పెట్టి.. ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. దీంతో దేశాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 8,318 Carona Cases
దేశంలో గత 24 గంటల్లో 9,69,354 కరోనా టెస్టులు చేయగా 8,318 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,67,933 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,019గా ఉండగా, గత 24 గంటల్లో 10,967 మంది రికవరీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 121.06 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
Read More »దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,264 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,09,940గా ఉన్నాయి. గడిచిన 539 రోజుల్లో యాక్టివ్ కేసులు తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. నిన్న 1,11,481 యాక్టివ్ కేసులుండగా.. ఈ రోజు అది మరింత తగ్గింది.
Read More »దేశంలో తగ్గిన Carona Cases
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,283 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,949 మంది కోలుకున్నారు. 437 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,11,481 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 537 రోజుల్లో అత్యల్ప యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
Read More »భారత్ లో Carona Third Wave ఉందా..?
కరోనా నుంచి దేశానికి ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. గత 3 వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది. 98.32% రికవరీ రేటుతో.. జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు, చలికాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు భారత్లో కరోనా …
Read More »దేశంలో కొత్తగా కరోనా కేసులు 8 వేలు
దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. …
Read More »దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరింది. ఇందులో 3,39,22,037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,65,662 మంది మరణించారు. ఇంకా 1,22,714 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 12,329 మంది కరోనా నుంచి బయటపడగా, 313 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,16,50,55,210 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ …
Read More »దేశంలో కొత్తగా 10,302 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,302 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 267 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 11,787 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,24,868 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 11,106 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.
Read More »