కేరళలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగా వస్తుండటంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారినపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యంతో వ్యాక్సిన్ వేసుకోనివారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.
Read More »దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు (Corona cases) వరుసగా రెండో రోజూ పెరిగాయి. బుధవారం 8954 కేసులు నమోదవగా తాజాగా అవి 9 వేలు దాటాయి. దీంతో నిన్నటికంటే ఇవి 8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 9765 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతిచెందారు. మరో 99,763 కేసులు యాక్టివ్‌గా …
Read More »కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా అనుమతివ్వండి
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీరం సంస్థ భారత డ్రగ్ నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు చేసుకున్నది. తమ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐని కోరింది. తమ వద్ద కావాల్సినన్ని టీకాలు నిలువ ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దడ …
Read More »ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO
ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా వైరస్
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 184 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి 137 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,75,798కి చేరింది. మృతుల సంఖ్య 3,990కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Read More »12దేశాల్లో రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) మరికొన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు 12 దేశాల్లో ఈ కేసులను గుర్తించారు. సౌతాఫ్రికా, బోట్స్వానా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే చాలా దేశాలు ముందుజాగ్రత్తగా ఇతర దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.
Read More »మాస్కులు పెట్టుకోండయ్యా..?
‘కరోనా లేదు బిరోనా లేదు’ అని చాలా మంది మాస్కు పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతుండటంతో మాస్కు తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొక్కుబడిగా కాకుండా నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ రాదనేది తప్పుడు ప్రచారమని, 2 డోసుల టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు.
Read More »దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 8309 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,80,832కు చేరింది. ఇందులో 3,40,08,183 మంది కోలుకున్నారు. మరో 1,03,859 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,68,790 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 9905 మంది కరోనా నుంచి బయటపడగా, 236 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 544 రోజుల కనిష్ఠానికి చేరాయని …
Read More »కెనడాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్
ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వెస్ తెలిపారు. మానిటరింగ్, టెస్టింగ్ ప్రక్రియ …
Read More »కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి కొన్ని దేశాల్లో అత్యంత ప్రమాదకరమైన ఒమిన్ అనే కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని WHO సూచించింది. 1. పండుగలు, ఇతర వేడుకలు కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహణ 2. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండటం. 3. ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేలా చూడటం. 4. వైరస్ వ్యాప్తికి …
Read More »