దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర
దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే …
Read More »తమిళనాడులో కరోనా విలయతాండవం
నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో …
Read More »సత్యరాజ్ కి కరోనా
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాడు. కాగా.. గత రాత్రి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి సుపరిచితుడు.
Read More »పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం
పంజాబ్- అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో 173 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న కూడా ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 125 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలారు.
Read More »స్టార్ హీరోయిన్ కి త్రిష కరోనా
స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తనకు కోవిడ్ సోకిందని ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే తనకు వచ్చిందని పేర్కొంది. వైరస్ నుంచి వేగంగా కోలుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నానని, దాని వల్ల మేలు జరిగిందని చెప్పింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.
Read More »దేశంలో కొత్తగా 1,41,986 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వణుకు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,41,986 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 24వేల కేసులు పెరిగాయి. మహమ్మారితో మరో 285 మంది మృతి చెందారు. పాజిటివ్ రేటు ఏకంగా 9.28%కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షల 72 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకూ.. మొత్తం 3కోట్ల 44లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా, 4 లక్షల …
Read More »దేశంలోఒకే రోజు ఏకంగా 1,17,100 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఏకంగా 1,17,100 కొత్త కేసులు వచ్చాయి. కరోనా బారిన పడి మరో 302 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 4,83,178కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 7.74%కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,71,363 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న 90వేల కేసుల రాగా.. ఒక్కరోజులో 27వేల కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read More »ముంబైలో కరోనా విలయతాండవం
దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే అక్కడ 20,181 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి నలుగురు మరణించారు. ఈమేరకు ఎంబీసీ బులెటిన్ విడుదల చేసింది. అక్కడి స్లమ్ ఏరియా ధారావిలో 107 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం ముంబైలో 79,260 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఏపీలో కొత్తగా 547 కరోనా కేసులు
ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,339 కరోనా టెస్టులు చేయగా 547 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20,78,923కు చేరగా ఇప్పటివరకు 14,500 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Read More »