ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.
Read More »దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం .. మహారాష్ట్రలో 43,697 కరోనా కేసులు కర్ణాటకలో 40,499 కరోనా కేసులు కేరళలో 34,199 కరోనా కేసులు గా గుజరాత్లో 20,966 కరోనా కేసులు తమిళనాడులో 26,981 కరోనా కేసులు ఉత్తరప్రదేశ్లో 17,776 కరోనా కేసులు ఢిల్లీలో 13,785 కరోనా కేసులు ప. బెంగాల్లో 11,447 కరోనా కేసులు ఆ ఏపీలో 10,057 తెలంగాణలో 3557 కరోనా కేసులు
Read More »కరోనా చికిత్సపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ ను ఉపయోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. రోగికి స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఇవ్వడంతో బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కొవిడ్ సోకిన వారికి రెండు, మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే టీబీ, ఇతర పరీక్షలు చేయాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 2,983 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,983 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 536 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,472యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,07,904 టెస్టులు నిర్వహించారు.
Read More »చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్ …
Read More »తెలంగాణలో కర్ఫ్యూ ఎప్పుడంటే…?
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిన్న సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైన సంగతి తెల్సిందే.. ఈ క్రమంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కర్ఫ్యూ అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. .. …
Read More »ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ కి కరోనా పాజిటీవ్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కరోనా బారినపడ్డారు. ఆయన కోవిడ్ కు సంబంధించిన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా …
Read More »చంద్రబాబుకు కరోనా పాజిటీవ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవిడ్ బారిన పడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ గా తేలిందని ఆయన తన అధికారక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇక, మాజీ మంత్రుల్య్ దేవినేని ఉమ, నారా లోకేష్ నాయుడు లకు సైతం కరోనా …
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ
దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి. కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Read More »