కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,207 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,215 కరోనా పరీక్షలు చేయగా.. 4,207 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.75శాతంగా ఉంది.
Read More »హైదరాబాద్ లో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,645 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,670,866 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు
Read More »కరోనా ఫస్ట్ వేవ్ థర్డ్ వేవ్ ల మధ్య తేడా ఇదే..?
ప్రస్తుత కరోనా థర్డ్ వేవ్ వ్యాక్సినేషన్ తో మరణాలు గణనీయంగా తగ్గాయని కేంద్రం వెల్లడించింది. సెకండ్ వేవ్ ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు, 3,059 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అప్పటికి 2% మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని పేర్కొంది. తాజాగా జనవరి 20న 3,17,532 కేసులు, 380 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 72 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో మరణాల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొంది.
Read More »తెలంగాణలో నేటి నుండి ఫీవర్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుండి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్ …
Read More »తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …
Read More »తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా
తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ తోపాటు మరో 14 జిల్లాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హనుమకొండ, సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, పెద్దపల్లి, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాకపోకలు యథేచ్ఛగా కొనసాగడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 30వేల కేసులు పెరిగాయి. ఇక కొత్తగా 491 మంది వైరస్లో మరణించారు. మరోవైపు తాజాగా 2,23,990 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
Read More »తెలంగాణలో కొత్తగా 3,557 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,557 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 574 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,11,178 టెస్టులు నిర్వహించారు.
Read More »ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి సురేష్ క్లారిటీ
ఏపీ రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు’ అని మంత్రి అన్నారు.
Read More »