ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజువారీ కేసులు సుమారు 15వేలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో విపరీతంగా కేసులు పెరిగాయి. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ఏపీలోనూ లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో సైతం కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.
Read More »‘డోలో 650’ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా..?
ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం …
Read More »దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (3,37లక్షలు) స్వల్పంగా తగ్గాయి. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.
Read More »తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం
ఏపీలో చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేపుతోంది. ఐఐటీ క్యాంపస్లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ గా తేలింది. వీరందర్నీ క్యాంపస్ లోని ఐసోలేషన్లో ఉంచారు. ఈ నెల మొదటి వారంలో 600 మంది విద్యార్థులు సొంత ఇళ్లకు వెళ్లడంతో కొందరు మాత్రమే క్యాంపస్లో ఉన్నారు.
Read More »మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »GHMCలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »దేశంలో అందులో ఏపీ టాప్
దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15-18 ఏళ్ల మధ్య వారిలో ఇప్పటివరకు 52% మందికి తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు పంపిణీలో ఏపీ టాప్లో ఉంది.. 91% మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత 83% మందికి వ్యాక్సిన్తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55% మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో …
Read More »