తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.
Read More »సోనూసూద్ కి మద్ధతుగా హీరోయిన్
కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More »ఏపీలో 20,065 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు.
కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు. 1. లక్షణాలు కనబడిన మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. 2. లక్షణాలు కనబడిన మొదటి రోజే ఒక డాక్టర్(online/offline) పర్యవేక్షణ లో ఉండండి. 3. లక్షణాలు కనబడిన రెండో రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు. RTPCR లో పాజిటివ్ రాగానే కంగారు పడుతూ హాస్పిటల్స్ కి పరిగెత్తకండి. RTPCR లో …
Read More »సర్కారు దవాఖానల్లో సేవలు భేష్
కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం …
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »