కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీరో మహేశ్ బాబు సూచించారు. ‘కరోనా తీవ్రమవుతోంది. బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించండి. అవసరమైతేనే బయటకు రండి. కరోనా బారినపడితే ఏ లక్షణాలతో బాధపడుతున్నారో చూసుకోండి. వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆస్పత్రికి వెళ్లండి. దీంతో అవసరమైన వారికి పడకలు అందుతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మరింత దృఢంగా తయారవుతాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని మహేశ్ ట్వీట్ చేశారు.
Read More »కరోనా ఎఫెక్ట్ – మందుబాబులకు వార్నింగ్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవాళ్లపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు ఎక్కువగా ఉంటోందన్నారు. మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, CII ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో ఈ విషయం …
Read More »మంచు లక్ష్మీపై మరోసారి ట్రోలింగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మంచు లక్ష్మీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుతుంది. కరోనా మొదటి డోస్ తీసుకున్నానని చెప్పడంతో మంచు లక్ష్మీపై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. యశోద హాస్పిటల్లో ఫస్ట్ డోస్ వేసుకున్నానని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారని, కానీ మంచు లక్ష్మీకి ఎలా వేశారు. రెండో డోస్ వేసుకునే వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తున్నామని ప్రభుత్వం …
Read More »తెలంగాణలోని పల్లెల్లో కరోనా విజృంభణ
తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.
Read More »సోనూసూద్ కి మద్ధతుగా హీరోయిన్
కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.
Read More »మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More »ఏపీలో 20,065 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More »కరోనా ఎఫెక్ట్ – మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం
దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.
Read More »తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ
తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.
Read More »