తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు …
Read More »సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గం.8 వరకు కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,237కు చేరాయి. ఇక నిన్న ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,723కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 268 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఏపీలో తగ్గని కరోనా కేసులు
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాష్ట్రంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిల్స్ పరీక్షించారు.. వీటిలో 1,326 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. ఇక తాజాగా ఐదుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,244కి చేరింది. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు
Read More »హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగవంతం
హైదరాబాద్‌లో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోలో వాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ వేయనున్నారు. 80 లక్షల మంది 45 ఏళ్ళుపై బడిన వారు ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది.
Read More »కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్
ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్ లో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 48.39 శాతం టీకాలు ప్రైవేట్ కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. ఢిల్లీ(43.11 శాతం) రెండో స్థానంలో ఉందని ప్రకటించింది అటు దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది అక్కడ ఇప్పటివరకు 57 లక్షల డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది
Read More »కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.
Read More »మాస్కు లేని వారికి 1,000 జరిమానా
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 …
Read More »