Home / Tag Archives: carona possitive (page 54)

Tag Archives: carona possitive

మహారాష్ట్రలో కరోనా బీభత్సం

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.

Read More »

రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది?

రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటి డోసులో ఓ కరోనా వ్యాక్సిన్ తీసుకుని రెండో డోసులో పొరపాటున మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది?. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీనిపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడించింది. ఇలా వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో అలసట, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇతర సమస్యలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.

Read More »

తెలంగాణలో మే 31 వరకూ ఫస్ట్ డోస్ లేదు

తెలంగాణ రాష్ట్రంలో మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని DMHO డా. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. మే 31 వరకూ ఎవరికీ ఫస్ట్ డోస్ ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 71,221 టెస్టులు చేయగా.. 4,693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 734 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. తాజాగా 33 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. 6,876 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కాగా  రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

సీఎం జగన్ అసంతృప్తి

కరోనా బాధితులకు టీకాల కొరత ఏపీలోనే కాదు దేశమంతటా ఉందని సీఎం జగన్ అన్నారు. డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు రెడీగా లేవని సీఎం జగన్ తెలిపారు. టీకాల పంపిణీ కేంద్రం నియంత్రణలో ఉంటుందని తెలిసి కూడా ప్రతిపక్షాలు, మీడియా తమపై విమర్శలు చేస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటివరకు కేంద్రం నుంచి 73 లక్షల …

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 4,801 పాజిటివ్ కేసులు.. 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 2,803 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.. రాష్ట్రవ్యాప్తంగా 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 75,289 నమూనాలను పరీక్షించారు.

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనాకు గురయ్యారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా …

Read More »

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ జైలు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సెంట్రల్ జైలును యుద్ధప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న ఎంజీఎం సరిపోకపోవడంతో 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలు ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మించాలన్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్ కేర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

Read More »

మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.

Read More »

మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే

సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat