తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 32మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.33 శాతంగా ఉంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64,362టెస్టులు చేశారు.
Read More »నేడు రేపు తెలంగాణలో వ్యాక్సిన్ బంద్
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు, రేపు నిలిచిపోనుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిని 12-16 వారాలకు కేంద్రం మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను శని, ఆదివారాల్లో నిలిపివేసింది. ఈ నెల 17 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »త్వరలో 2డీజీ డ్రగ్స్
DRDO భాగస్వామ్యంతో కరోనా బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డా. రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. వచ్చేవారమే 10వేల డోసుల మొదటి బ్యాచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్, DRDO అధికారులు తెలిపారు. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
Read More »ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.8 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వ్యాక్సిన్ డోసులు చేరుకోన్నాయి… తొలుత వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపనున్నారు. టీకాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ.. తాజాగా వచ్చిన టీకాలతో కాస్త ఉపశమనం లభించనుంది.
Read More »దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా
దేశంలో త్వరలో సింగిల్ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అనే సింగిల్ డోసు టీకా కోసం డాక్టర్ రెడ్డీస్, కేంద్రంతో చర్చలు జరుపుతోంది. అన్ని అనుమతులు లభిస్తే జులై నాటికి స్పుత్నిక్ లైట్ టీకా దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి రష్యాలో ఇప్పటికే అత్యవసర అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ 79.4% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు రష్యా తెలిపింది.
Read More »మంత్రి హారీష్ రావు ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీటీ స్కాన్ రేట్లు తగ్గాయి. రూ.2 వేలకే స్కాన్ చేసేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయి. సీటీ స్కాన్ కోసం రూ. 5,500 వసూలు చేయడంపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లను సగానికి తగ్గించాలన్నారు. అందుకు వారు ఓకే చెప్పారు.
Read More »తెలంగాణలో కరోనా కేసుల్లేని ఏకైక గ్రామం అదే..?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వారానికి 2 సార్లు ఊరంతా శానిటైజేషన్, శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు, ఊర్లోకి ఎవరు వచ్చినా సాయంత్రానికే వెళ్లిపోవడం వంటి పంచాయతీ తీర్మానాలతో ఆ ఊరు భద్రంగా ఉంది. సెకండ్ వేవ్లో ఒక వ్యక్తికి స్పల్ప లక్షణాలు కనబడినా టెస్ట్ …
Read More »భైంసాలో బ్లాక్ ఫంగస్ కలవరం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్క హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ ఫంగస్పై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.. స్టెరాయిడ్స్ తీసుకున్న అందరికీ ఈ సమస్య రాదన్నారు.
Read More »