తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 16 …
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్
కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.
Read More »ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.
Read More »కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్
తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read More »COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ
■ COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ | ■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. > లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. > 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా …
Read More »అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసిన గ్రీన్ కో సంస్థ
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »చద్దన్నం తింటే ఉంటది
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చద్దన్నం మంచి మెడిసిన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని బ్యాక్టీరియా శరీరంలోని హానికర వైరస్లను నాశనం చేస్తుంది. చద్దన్నంలో చాలా రకాల పోషకాలుఉంటాయి. 1. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 2. చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది. 3. మలబద్ధకం, పేగుల్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 4. B12, B6 విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. 5. బీపీ కంట్రోల్లో ఉంటుంది.
Read More »