దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ పై ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగసు నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైనా తమకు సమాచారం అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు అందించాలని తెలిపింది.
Read More »రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …
Read More »కరోనా రోగులకు ధైర్యం.. డాక్టర్లకు అభినందన : సీఎం KCR
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా …
Read More »పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనా
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనాకు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుద్ధదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా …
Read More »కరోనాతో మరణించిన యూపీ మంత్రి
కరోనా మహమ్మారికి మరో రాజకీయ ప్రముఖుడు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో కన్నుమూశారు. 56 ఏండ్ల కశ్యప్ కరోనా బారినపడటంతో గుర్గావ్‌లోని వేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడటంతో ఆయన మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజఫర్‌నగర్‌లోని ఛర్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు కరోనా వల్ల మరణించారు. కశ్యప్ …
Read More »తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »కొవిడ్ కట్టడిలో తెలంగాణ మార్గదర్శి
కొవిడ్ నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గదర్శిగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో డీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో …
Read More »తెలంగాణలో కొత్తగా 3,892 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. మరో 27 కోవిడ్-19 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 5,186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 607, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ 225 కరోనా కేసులు …
Read More »ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం
కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలబడుతున్న హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ సామాన్యులకే కాదు సర్కారులకు సాయం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో 2 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని సోనూ స్నేహితులు తమ జిల్లాకు ఏమైనా సాయం చేయాలని కోరారు. అవసరాలు ఏంటో చెప్పండని కోరగా వారు కలెక్టర్ చక్రధర్ బాబుతో మాట్లాడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ …
Read More »నేడే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమా
కరోనా కాలంలో గంగపుత్రులను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ YSR మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా ఈ పథకానికి రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ జగన్ సర్కార్ సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చేపల వేటను నిషేధించిన టైంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో ఫ్యామిలీకి.. ఈ స్కీమ్ ద్వారా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Read More »