తెలంగాణ రాష్ర్టంలో కరోనా లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్లకు …
Read More »సాయం చేయండి-శృతి హసన్ పిలుపు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఇలాంటి వారిని తమకు తోచిన విధంగా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని హీరోయిన్ శృతిహాసన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘లాభం’ చిత్రంలో నటించింది. అలాగే, తెలుగు, కన్నడ భాషల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా సినిమాల షూటింగులన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతం ముంబైలోని తన సొంతింటిలో ప్రియుడితో …
Read More »కంటతడిపెట్టిన సోను సూద్
కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,242 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 19 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,53,277 కు చేరింది. మొత్తంగా 3,125 మంది మృతి చెందారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీ సంఖ్య 5,09,663 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,489 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »RGV ఇంట్లో విషాదం
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.
Read More »తెలంగాణలో కొత్తగా 3,308 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ర్టంలో కొత్తగా 3,308 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 21 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 4,723 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్‌ర్టంలో ప్రస్తుతం 42,959 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 513, ఖమ్మం జిల్లాలో …
Read More »అందుకే అబ్దుల్ కలాంకు సెల్యూట్
2డీజీ (2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్) కొవిడ్ ఔషధాన్ని DRDO గ్వాలియర్ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త డా. కరుణ్ శంకర్ వెల్లడించారు. ఈ 2DG అణువును రూపొందించాలని ఆనాటి DRDO డైరెక్టర్ APJ అబ్దుల్ కలాం సూచించారని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో వాడే దీని కోసం అప్పట్నుంచి USపై ఆధారపడటం తగ్గించామని పేర్కొన్నారు. దీనికి 1998లో పేటెంట్ రాగా.. 2002లో డ్రగ్కు ఆమోదం లభించింది.
Read More »తొలిసారిగా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల దిగుమతి
• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశంలో తొలిసారిగా భారీ సంఖ్యలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వ అవసరాలకోసం ఉచితంగా అందేంచేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ …
Read More »కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మవచ్చా..?
కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు…. ———————————————————— *ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారి విశ్లేషణ* సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం… ఒక సైన్స్ విద్యార్థిగాకాదు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గా అందులో ఔషధ రసాయన శాస్త్రం పాఠాలు చెప్పిన బోధకుడిగా చెప్తున్నా… సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొద్దు.. ? ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద …
Read More »సినిమాల్లోకి మోదీ
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
Read More »