భారత్ ను సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో యువత ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారు. మే నెలలోని మొత్తం కేసుల్లోని దాదాపు 26 శాతం.. 18-30 ఏళ్ల వారిలోనే నమోదయ్యాయి. వీరి తర్వాత 31-40 ఏళ్ల వారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. 18-44 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినా.. టీకాల కొరతతోనే చాలా రాష్ట్రాల్లో అది అమలు కావట్లేదు.
Read More »తానేమి తక్కువ కాదంటున్న నిధి అగర్వాల్
టాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటోంది. గతేడాది కరోనా సమయంలో తన వంతు సాయం చేసిన నిధి.. తాజాగా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కష్టకాలంలో ఎవరికి సాయం కావాలన్నా అడగాలని, తనకు చేతనైన సాయం చేస్తానని తెలిపింది. ఆర్గనైజేషన్ కోసం తనతో పాటు తన టీం కూడా పని చేస్తుందని నిధి పేర్కొంది.
Read More »బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఆ 5రాష్ట్రాల్లోనే
దేశంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. గుజరాత్లో 2,859, మహారాష్ట్రలో 2,770, APలో 768, మధ్యప్రదేశ్లో 752, తెలంగాణలో 744 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు పేర్కొంది. ఈ చికిత్సకు ఉపయోగించే యాంపోటెరిసిన్-B ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాలకు అదనంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు. APకి ఇప్పటివరకు 1930, తెలంగాణకు 1890 వయల్స్ ను కేంద్రం అందించింది.
Read More »ఏపీలో కరోనా కలవరం
ఏపీ కరోనా బులెటిన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా.. 18,285 పాజిటివ్ కేసులు వచ్చాయి. 99 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,427 మంది మృతి చెందారు. 14,24,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్న టెస్ట్ …
Read More »తెలంగాణలో లాక్డౌన్ వల్ల సత్ఫలితాలు
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డ్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. గత 24 గంటల్లో 91 వేల కొవిడ్ పరీక్షలు చేయడం జరిగింది.. ఇందులో 3,762 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. మరో 20 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు గణనీయంగా 4.1 శాతానికి తగ్గిందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని ఆయన …
Read More »ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »భయమోద్దంటున్న సుమ..ఎందుకంటే…?
బుల్లితెరతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్, సరదాగా ఉండే యాంకర్ సుమ.. ఓ వీడియో ద్వారా అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. సై సినిమాలో రగ్బీ కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ను అచ్చు గుద్దినట్లు దించేసిన సుమ.. ‘అందరూ ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనలోని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి. భయపెట్టే వాటిని చూడకండి’ అని చెప్పింది.
Read More »కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డ్ డౌన్ అమలు తీరుపై మంత్రి హరీశ్ రావు BRK భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీపై CS సోమేశ్కుమార్, అధికారులతో చర్చించారు. సూపర్ సైడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై చర్చలు జరిపారు. త్వరలోనే వారికి వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా చూడాలన్నారు.
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉచిత సలహాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …
Read More »