ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »వివాదంలో మీరా చోప్రా
నటి మీరా చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. థానేలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్గా చెప్పుకుని తప్పుడు పత్రాలు చూపి వ్యాక్సిన్ తీసుకుందని BJP నేత ఒకరు ఇందుకు సంబంధించిన ఆధారాలు పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ‘బంగారం, వాన, మారో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఎన్నో హిందీ, తమిళ …
Read More »తెలంగాణలో కొత్తగా 1,801 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,801 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. కరోనా నుంచి 5,32,557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,263 మంది మృతి చెందారు.
Read More »విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read More »కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కేసులు, 3,128 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు పెరగ్గా, ఇప్పటివరకు 3,29,100 మంది కరోనా ధాటికి చనిపోయారు. మరో 2,38,022 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఆనందయ్య మందుపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పేరు అందరిలో ఓ ఆశను కలిగించిది. ఆనందయ్య వేస్తున్న మందు వలన చాలా మంది కోలుకుంటున్నారని అందరు కృష్ణపట్నంకు క్యూలు కట్టారు. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది నాటు మందు …
Read More »తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో …
Read More »ఫంగస్ కు భయపడకండి ..నేనున్నా అంటున్న కిషన్ రెడ్డి
“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక …
Read More »డాక్టర్లపై దాడి – కేసు నమోదు -అరెస్టు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ‘విరించి’ ఆసుపత్రిలో తమ బందువు కు సరైన చికిత్స అందించక పోవడం మూలంగా వ్యక్తి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మే కారణమని మృతుని బంధువులు, స్నేహితులు కొందరు ఆసుపత్రి సిబ్బంది తో వాగ్వాదం కు దిగారు . పంజాగుట్ట పోలీసులు విషయం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని వారించెందుకు యత్నించారు.అవేశంతో వుగిపోయిన మృతుని బంధువులు ఆసుపత్రి లో …
Read More »