దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు. మరో 93,277 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మహమ్మారి వల్ల మరో 398 మంది బాధితులు …
Read More »స్విట్జర్లాండ్‌లో 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్
స్విట్జర్లాండ్‌లో ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమయింది. ఫైజర్ బయోఎన్‌టెక్ తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్ మెడిసిన్స్ ఏజెన్సీ స్విస్‌మెడిక్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్ గ్రూప్‌వారికి టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్, కెనడా, అమెరికా దేశాలు ఈ ఏజ్ గ్రూప్ చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌కు …
Read More »దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో 3,40,97,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,111 మంది మరణించగా, 94,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది. …
Read More »కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన బిల్ గేట్స్
కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేశారు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్ర దశ ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఆందోళన పరిస్థితి తప్పదన్నారు. ఈ దశలో మరో సంక్షోభాన్ని అంచనా వేయలేమని, కానీ మహమ్మారికి చెందిన తీవ్ర దశ వచ్చే ఏడాది ముగియనున్నట్లు ఆయన తెలిపారు. గేట్స్ …
Read More »Carona థర్డ్ వేవ్ కి కారణం ఇదే..?
సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న కాలేజీల్లో ఫెస్ట్ లు ఊపందుకున్నాయి. వీటిలో విద్యార్థులెవరూ కనీసం మాస్కులు ధరించకుండా పాల్గొనడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో 280 మందికి కరోనా సోకగా.. తాజాగా కరీంనగర్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో 43 మంది వైరస్ బారిన పడ్డారు. అందుకే విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Read More »కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సంచలన విషయాలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతా విస్తరించే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డా. మనీంద్ర అగర్వాల్ అన్నారు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెల లో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. మరోవైపు వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమని, కరోనా నిబంధనలు పాటిస్తే బయటపడొచ్చన్నారు. …
Read More »దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు
ఇండియాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య సగటున 10 వేలకు మించడం లేదు. ఇతర ప్రపంచ దేశాలైన యూరోపియన్ దేశాలు, రష్యాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.అక్కడ రోజుకు సగటున 30 వేల కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్న ఇండియా లాంటి దేశంలో రోజుకు 10 వేల లోపు కేసులు నమోదవ్వడం శుభసూచికం. కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల …
Read More »భారత్ లో Carona థర్డ్ వేవ్ కి అదే కారణమా..?
సౌతాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్ లో థర్డ్ వేవ్ కు ప్రధాన కారణం కావచ్చని IIT కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. వ్యాక్సిన్ కంటే సహజ రోగ నిరోధక శక్తి ఈ వేరియంట్ను ఓడించగలదని ఆయన అన్నారు. దేశంలోని 80% జనాభాలో సహజ రోగ నిరోధక శక్తి బలోపేతం అయిందని …
Read More »ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO
ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా వైరస్
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 184 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి 137 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,75,798కి చేరింది. మృతుల సంఖ్య 3,990కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Read More »