తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,759 టెస్టులు చేయగా.. 311 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కు చేరాయి. .. గడిచిన 24 గంటల్లో 222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 159 మందికి టెస్టులు చేయగా.. 7 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటి కంటే స్వల్పంగా తగ్గాయి. తాజాగా 130 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కొవిడ్తో ఒకరు చనిపోయారు. 97 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,979.మరణాల సంఖ్య- 14,493. మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,61,405 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,081
Read More »నోరా ఫతేహికి కోవిడ్
బాలీవుడ్ నటి నోరా ఫతేహికి కోవిడ్ సోకింది. తాను కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపిన నోరా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మాస్కులు ధరించాలని కోరింది. వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న ఫతేహి.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని తెలిపింది. కాగా ప్రభాస్ ‘బాహుబలి’లో స్పెషల్ సాంగ్లో ఈమె నటించింది.
Read More »అమెరికాలో ఒక్కరోజే 6లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఒక్క అమెరికాలోనే 6 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఇదే ప్రపంచ రికార్డు అని, ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా కాటుకు 1300 మంది మరణించారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఫ్రాన్స్లో 2.06 లక్షలు, UKలో 1.90 లక్షల …
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇవాళ 1100 కేసులు పెరిగాయి. ఇక థారావిలో మే 18 తర్వాత అత్యధికంగా ఇవాళ 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించడంపై సీఎం ఉద్దవ్ థాక్రే అధికారులతో …
Read More »తెలంగాణలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కు పెరిగింది. వీరిలో 22మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఒకరు చనిపోయారు. నిన్న మరో 206 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య …
Read More »తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »అమెరికాలో కరోనా కలవరం.. ఒకేరోజు 3లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 వందల మందికి పైగా మహమ్మారి వల్ల చనిపోయారు. ఫ్రాన్స్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. అక్కడ నిన్న ఒక రోజే 2లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. పోర్చుగల్లో 26 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. పొలాండ్లో 15వేలు, రష్యాలో 21 వేల కేసులు నమోదయ్యాయి.
Read More »మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు పెరిగింది. వీటిలో ఒక ముంబైలోనే 137 కేసులు ఉన్నాయి. మరోవైపు గత 24గంటల్లో కొత్తగా 3,900 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ వల్ల 20 మంది చనిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం 14,065 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ముంబైలో 1,377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వ్యాప్తంగా 2,172 కేసులు రాగా.. ఇవాళ ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని కేసులు నమోదవ్వడం గమనార్హం. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.
Read More »