కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం, దక్షిణ భారత దేశంలో ద్వితీయ, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలువడం గర్వకారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని, ఈ విజయాన్ని కేసీఆర్‌కే అంకితం చేస్తున్నామని ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో జిల్లా సాధించిన విజయానికి గుర్తుగా బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి …
Read More »మెగాస్టార్ చిరంజీవికి కొవిడ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. థర్డ్ వేవ్ మొదలైనప్పటికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇటీవల ఆయనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవలసిందిగా …
Read More »ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా
టీమిండియాకు చెందిన మాజీ ఓపెనర్ క్రికెటర్, కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని గౌతీ ట్విటర్లో వెల్లడించాడు. తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు. మరోవైపు కొత్త ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కి గంభీర్ మెంటార్ గా …
Read More »కరోనా పై Good News
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మాత్రం కరోనా ఉధృతి మాత్రం కాస్త స్వల్పంగా తగ్గింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,55,874 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 20.75శాతం నుంచి 15.52శాతానికి తగ్గింది. 614మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »GHMCలో కొత్తగా 1,421 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో గడిచిన గత 24 గంటల్లో 1,421 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,72,700 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.
Read More »ఏపీలోనూ లాక్డౌన్ ఉంటుందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజువారీ కేసులు సుమారు 15వేలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో విపరీతంగా కేసులు పెరిగాయి. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ఏపీలోనూ లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో సైతం కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.
Read More »‘డోలో 650’ అనే పేరు దానికి ఎలా వచ్చిందో తెలుసా..?
ప్రస్తుతం కరోనా వల్ల ‘డోలో 650’ అనే పేరు ప్రపంచమంతటా మారుమోగుతోంది. ‘డోలో 650’ అనేది బ్రాండ్ పేరు. మందు పారాసెటమాల్. 650 ఎంజీ అంటే డోసు. పీ 650, సుమో ఎల్, పారాసిస్, పాసిమోల్, క్రోసిన్ ఇలా. చాలా పారాసెటమాల్ బ్రాండ్లు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సుపరిచితమైంది మాత్రం ‘డోలో 650’. కరోనా మొదటి లక్షణం జ్వరం కావడంతో డాక్టర్లు పారాసెటమాల్ వాడాలని సూచిస్తున్నారు. కానీ ప్రజలకు గుర్తుకొచ్చేది మాత్రం …
Read More »దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా
దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 3,06,064 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోల్చితే 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కాగా పాజిటివిటీ రేటు 17.78శాతం నుంచి 20.75శాతానికి చేరుకుంది. 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3.33లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (3,37లక్షలు) స్వల్పంగా తగ్గాయి. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 17.78శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.
Read More »