ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్‌వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »తెలంగాణలో 635 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,151కి కరోనా కేసులు నమోదు కాగా, 1,489 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,670 యాక్టివ్ కేసులు ఉండగా, 2,67,992 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read More »దేశంలో 98 లక్షల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కి చేరింది. ఇందులో 92,90,834 మంది బాధితులు కోలుకోగా, కరోనా బారినపడిన పడిన 3,63,749 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,42,186 మంది …
Read More »తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 643 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరింది. వైరస్ నుంచి తాజాగా 805 మంది కోలుకున్నారు.. ఇప్పటి వరకు 2,66,925 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 1482 మంది మృత్యువాతపడ్డారు. మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉండగా.. దేశంలో …
Read More »దేశంలో మళ్లీ కరోనా కలవరం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 …
Read More »కృతిసనన్‌కు కరోనా
బాలీవుడ్‌లో కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మడు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘర్ నుండి ముంబై వచ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో …
Read More »తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,73,341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,125 యాక్టివ్ కేసులు ఉండగా 2,63,744 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 104 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,72,719కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,470కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 8,498 యాక్టివ్ కేసులున్నాయి. 2,62,751 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 …
Read More »ఏపీలో కొత్తగా 625 కరోనా కేసులు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 మంది కరోనా బారినపడ్డారు. 49,348 మందికి పరీక్షలు నిర్వహించగా 625 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కృష్ణాలో 103, పశ్చిమగోదావరి 93, విశాఖపట్నం 88, గుంటూరు 68, చిత్తూరు 61 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 8,67,063 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 8,48,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో …
Read More »