తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్‌లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్ ద్వారావెల్లడించారు. తనతోపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్‌లో ఉన్నామని చెప్పారు. ఈ కారణంగా ఎవరినీ కలవలేమని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేనని స్పష్టంచేశారు.
Read More »తెలంగాణలో ఆగని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం మొత్తం 70,280 పరీక్షలు నిర్వహించగా మొత్తం 431 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఈ ప్రకటనను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో అత్యధికంగా రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలోనే 111 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 37,రంగారెడ్డి …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. కొత్తగా 228 మంది హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 2,99,270 మంది కోలుకున్నారని చెప్పింది. 24 గంటల్లో మరో ఇద్దరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా.. మొత్తం మృతుల …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో మహమ్మారి ఏమాత్రం ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో 47,262 పాజిటివ్ కేసులు రికారయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. అలాగే ఒకే రోజు పెద్ద ఎత్తున 275 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన మొత్తం కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,058కు పెరిగింది. మరో 23,907 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు …
Read More »దేశంలో కొత్తగా 40,715కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 40,715 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. కొత్తగా 29,785 మంది కోలుకోగా.. 1,11,81,253 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో 199 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు …
Read More »దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభణ
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు.దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు …
Read More »లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. ఈ నెల 19న ఆయన కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, శనివారం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు ఆ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపింది.
Read More »ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 58 మందికి వైరస్ సోకగా చిత్తూరులో 45, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 23, తూర్పుగోదావరిలో 20, కర్నూలులో 15 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,091కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 137 మంది కరోనా నుంచి …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 47 కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
Read More »