ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాష్ట్రంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిల్స్ పరీక్షించారు.. వీటిలో 1,326 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. ఇక తాజాగా ఐదుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,244కి చేరింది. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు
Read More »హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగవంతం
హైదరాబాద్‌లో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోలో వాక్సినేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ వేయనున్నారు. 80 లక్షల మంది 45 ఏళ్ళుపై బడిన వారు ఉన్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది.
Read More »కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్
ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్ లో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 48.39 శాతం టీకాలు ప్రైవేట్ కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. ఢిల్లీ(43.11 శాతం) రెండో స్థానంలో ఉందని ప్రకటించింది అటు దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది అక్కడ ఇప్పటివరకు 57 లక్షల డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది
Read More »కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.
Read More »మాస్కు లేని వారికి 1,000 జరిమానా
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 31,643 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా …
Read More »భారత్ ను భయపెడుతున్న కరోనా
భారత్ లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 62వేల కొవిడ్ కేసులు వచ్చాయి. మరో 312 మంది చనిపోయారు. దేశంలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్లో రోజు రోజుకు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొత్తం 62,714 మందికి వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 28,739 మంది వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇంకా 4,86,310 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో భారీగా కరోనా కేసులు
తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి తాజాగా.. రాష్ట్రంలో 535 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,06,339 కి చేరింది. తాజాగా మరో ముగ్గురు కొవిడ్ తో మరణించారు. మొత్తం మరణాలు 1688కి పెరిగాయి. మరో 278 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి ఆ సంఖ్య 4,495కి పెరిగింది.
Read More »