తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 2,909 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ కు మరో ఆరుగురు మరణించారు వారం కిందట వందల్లోనే ఉన్న రోజువారీ కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 3 వేలకు చేరువయ్యాయి. ఇక కొత్తగా మరో 584 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 17,791గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,11,726 కరోనా టెస్టులు నిర్వహించారు..
Read More »సెకండ్ వేలో కరోనా లక్షణాలు ఇవే..?
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న దశలో సెకండ్ వేలో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. గతంలో రోగుల్లో జలుబు, దగ్గు జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అటు చాలా మందిలో ఎలాంటి …
Read More »తెలంగాణలో కొత్తగా 1,914 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,914 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,734కు చేరుకున్నది. 11,617 మంది దవాఖానలు, హోంఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 393, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 205 వెలుగుచూశాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, …
Read More »నెల రోజుల్లో 79 వేల మంది చిన్నారులకు కరోనా
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతేడాది ఈ మహమ్మారి పెద్దలపై విరుచుకుపడగా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారులపై కోరలు చాచి బుసలు కొడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ర్టలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. …
Read More »త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్‌లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు …
Read More »సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గం.8 వరకు కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,237కు చేరాయి. ఇక నిన్న ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,723కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 268 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »