దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 2251 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. ఇప్పటివరకు 1765 మంది మరణించగా, 3,05,900 మంది …
Read More »ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి …
Read More »దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల …
Read More »ఆంధ్రప్రదేశ్ లో 2765 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో 31,982 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.ఇందులో 2765 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. నిన్న కరోనా వల్ల మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,94,896 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »మహారాష్ట్రలో 58,993 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో 58,993 పాజిటివ్ కేసులు రాగా, 301 మంది చనిపోయారు. 45,391 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 32.88లక్షలను చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 5.34 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Read More »RSS చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా
RSS చీఫ్ మోహన్ భగవత్ కు కరోనా సోకింది. శుక్రవారం చేసిన టెస్టులో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సంఘ్ తెలిపింది. దీంతో నాగ్పూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ భగవత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అటు ఇటీవల తనను కలిసిన వారు కరోనా భగవత్ కోరారు..
Read More »దేశంలో కొత్తగా 1,45,384 కరోనా కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతోంది కొత్తగా 1,45,384కేసులు వచ్చాయి. మహమ్మారి బారినపడి మరో 794 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 1.32 కోట్లు దాటింది. మరణాలు 1,68,436కు చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు మొత్తం 10,46,631కు చేరాయి. మరోవైపు ఇప్పటివరకు 9.80 కోట్ల మందికి టీకాలు వేశారు
Read More »GHMCలో 487 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పరిధి GHMCలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 487 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 86,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు …
Read More »