టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.తాజాగా రవితేజతో ‘ఖిలాడి’ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.
Read More »గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »దేశంలో ఐదుగురు సీఎంలకు కరోనా
కరోనావైరస్ దెబ్బకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు ఎవ్వరూ తప్పించుకోవట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.
Read More »పిల్లలు కూడా కరోనా బారిన పడకుండా ఏమి చేయాలంటే..?
సెకండ్ వేవ్ పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు నిమ్మజాతి పండ్లు, క్యారెట్లు, స్ట్రాబెర్రీ, ఆకుకూరలు, పెరుగును రోజువారీ ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లు పట్టుకుని, నిద్ర పోకుండా ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుందని అందుకే కనీసం 10 గంటల పాటు నిద్రపోయేలా చూడాలంటున్నారు. విటమిన్ డి తగిలేందుకు రోజూ అరగంట సేపు లేలేత ఎండలో ఉంచాలంటున్నారు.
Read More »టీకా వేశాక పాజిటివ్ రాదు!
వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్ …
Read More »కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది
Read More »మీరు ఆ మాస్కులనే వాడుతున్నారా..?
వస్త్రం (క్లాత్)తో తయారు చేసిన మాస్కుల కంటే N95 లేదా KN95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు N95 లేదా KN95 మాస్కులు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగులో ఉంచి మరుసటి రోజు వాడాలన్నారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చన్నారు. వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దన్నారు.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 2 లక్షల 73 వేల 810 మంది వైరస్ బారిన పడ్డారు. వరసగా 5వ రోజూ కేసులు 2 లక్షలు దాటాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఏకంగా 1,619 మంది మరణించారు. ఒక్క రోజులో సంభవించిన మరణాల్లో కూడా ఇవే అధికం. దేశంలో కరోనా మరింత ప్రమాదకరంగా …
Read More »GHMCలో 705 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం GHMCలో గడచిన 24 గంటల్లో మరో 705 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 90,770కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »హీరోయిన్ తో పాటు కుటుంబానికి మొత్తం కరోనా
కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెలియజేసిన సమీరా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఈ సమయంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాలని పేర్కొంది. అయితే సోమవారం ఉదయం నెటిజన్స్ సమీరా పిల్లల …
Read More »