తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు.సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు …
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం
లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
Read More »కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం
కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు
Read More »దేశ ప్రజలకు కోహ్లీ పిలుపు
దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …
Read More »రాహుల్ గాంధీకి కరోనా
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.
Read More »