సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …
Read More »సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగిటీవ్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.
Read More »తెలంగాణలో 10వేల మార్కు దాటిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 52 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, 2094 మంది మరణించారు. మరో 69,221 కేసులు …
Read More »దేశంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. …
Read More »గులాబీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో …
Read More »ఆపదలో ఉన్నా అంటే చాలు నేనున్నా అంటున్న మంత్రి కేటీఆర్
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివరిస్తూ యువకుడు రెమ్‌డెసివిర్ డ్రగ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. దయచేసి ఆంధ్రా ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరాడు. దీనిపై తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ తన స్నేహితుడు, ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి …
Read More »ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్-రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాక్ ఇచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. …
Read More »తెలంగాణలో కరోనా పంజా
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. నిన్న ఒకే వైరస్ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం …
Read More »దేశంలో కరోనా మహోగ్రరూపం
దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 …
Read More »GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …
Read More »