కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్‌బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని …
Read More »దేశంలో కరోనా విళయతాండవం
ప్రస్తుతం దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల …
Read More »టీమిండియా ఆటగాడు ఆశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం
టీమిండియా ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య పృథ్వీ నారాయణన్ తెలిపింది. శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ట్వీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు …
Read More »ఇండియాలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం మే 31 వరకు పొడిగింపు
అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని …
Read More »తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గతనెల 20వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం …
Read More »కరోనా ఎఫెక్టు- పేషెంట్ల కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా హీరో
కరోనా బాధితులకు సహాయం చేయడానికి దక్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. కరోనా పేషెంట్లను దవాఖానకు తీసుకెళ్లడం, దవాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్లడం చేస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన నటుడు అర్జున గౌడ. యువరాథన, రుస్తోమ్ సినిమాలతో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ.. ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్‌లో సభ్యుడిగా చేరి నిరేపేదలకు సేవలందిస్తున్నాడు. కరోనా సోకిన వారిని దవాఖానలకు తీసుకెళ్లడం, చనిపోయిన వారిని శ్మశాన …
Read More »కరోనా నుండి కోలుకున్న మాజీ ప్రధాని
ఇటీవల కరోనా మహమ్మారి భారీన పడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ కోలుకున్నారు.ఇటీవల ఆసుపత్రిలో చేరిన కరోనా మహమ్మారికి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి మన్మోహాన్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు.కరోనా సోకడంతో ఆయన ఈ నెల పంతొమ్మిది తారీఖున ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి విదితమే. ప్రస్తుతం మన్మోహాన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉంది..
Read More »పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా ఎంజీఎం
తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఉన్న ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో నాన్ కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందించనున్నారు. ఈ దవాఖానను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మొదట 50 పడకలతో సేవలు ప్రారంభించి, వారం రోజుల్లో దానిని 250 …
Read More »దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య …
Read More »తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. …
Read More »