తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన RT-PCR టెస్టులో సీఎంకు కరోనా నెగిటివ్ రాగా.. ఆయన ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల సీఎంకు నిర్వహించిన RT-PCR టెస్టులో ఫలితం వెలువడకపోగా, తాజాగా మరోసారి టెస్టు చేశారు. కాగా ఏప్రిల్ 19న కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.
Read More »తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 70,961 మందికి పరీక్షలు జరపగా 6,876కేసులు నమోదయ్యాయి. 59 మంది కరోనా బాధితులు మరణించారు. ఈ మేరకు తెలంగాణ హెల్త్ బులెటిన్ ను ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,432 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం
కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.
Read More »దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగింపు
తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగించారు. మే 8వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో కొవిడ్ విస్తరించేందుకు ఛాన్సులు ఎక్కువుండటంలో గతంలోనే థియేటర్ల యజమానులు, పంపిణీదారులు సినిమాలు నిలిపేశారు. వకీల్ సాబ్ మూవీకి మాత్రం మినహాయింపు ఇచ్చారు.
Read More »తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్
తెలంగాణలో గత 24 గంటల్లో 77,091 కరోనా టెస్టులు చేస్తే 7,646 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,35,606కు చేరింది. నిన్న కరోనాతో 53 మంది చనిపోగా, మరణాల సంఖ్య 2,261గా ఉంది. గత 24 గంటల్లో 5,926 మంది కరోనాను జయించారు. 77,727 యాక్టివ్ కేసులున్నాయి. మరణాల రేటు 0.51% కాగా రికవరీల రేటు 81.63%గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,29,05,854 కరోనా టెస్టులు చేశారు.
Read More »దేశంలో కరోనా ఉద్ధృతి హోరు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,498 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరగా మరణాల సంఖ్య 2,08,330గా ఉంది. మరోవైపు కరోనాను జయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,97,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,70,228గా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా టెస్టులు చేశారు.
Read More »కరోనాతో టాలీవుడ్ యువ దర్శకుడు మృతి
కరోనా వైరస్ విజృంభణ సెకండ్ వేవ్‌లో మరింత పెరిగింది. శుక్రవారం కరోనా కారణంగా టాలీవుడ్‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనా వైరస్ వల్ల కన్నుమూశారు. కొన్నిరోజుల ముందు ఆయన కొవిడ్ ప్రభావంతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో టాలీవుడ్ షాక్‌కు గురైంది. కుమార్ వట్టి స్వస్థలం …
Read More »