Home / Tag Archives: carona negative (page 54)

Tag Archives: carona negative

KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన

అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read More »

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా

ఏపీలో సంచలనం సృష్టించిన సంగం డెయిరీలో అక్రమాలకు సంబంధించి అరెస్టైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ తేలింది. ఇటీవల జ్వరం, జలుబు లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని హైకోర్టు ఏసీబీ అధికారులను ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించనున్నారు.

Read More »

తెలంగాణలో నియంత్రణలోనే కరోనా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం & హెచ్.ఓ.ల తో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు …

Read More »

కరోనా కట్టడీకి అదోక్కటే మార్గం

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటిన, 60 శాతం బెడ్లు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డ్ డౌన్ విధించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు కరోనా చైన్ని తెంచలేవన్నారు. ప్రాంతీయ లాక్డౌనే ఏకైక మార్గమన్న ఆయన.. ఇదే అంశం కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఉన్నా అమలు పరచడం లేదన్నారు.

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణ  రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా వైరస్‌ బారినపడి మరో 51 మంది మరణించారు. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా.. 6,361 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో …

Read More »

ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’

ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్‌ చేయించాలని చెప్పారు.. సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి …

Read More »

ఏపీ,తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం ఇదే..?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.

Read More »

తెలంగాణలో మరో ఇంటింటి సర్వే

కరోనాతో పోరులో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటు చేసింది. వీరు కరోనా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.

Read More »

అమిత్ మిశ్రాకి కరోనా

ఐపీఎల్ 2021ను కరోనా వాయిదా వేయించింది. ఆటగాళ్లలో వరసగా కేసులు వస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా పాజిటివ్ గా తేలాడు. నిన్న సాయంత్రం చేసిన టెస్టులో మిశ్రాకు పాజిటివ్ వచ్చింది. రెండురోజుల వ్యవధిలో కరోనా సోకిన నాల్గవ ప్లేయర్ అమిత్ మిశ్రా. DC క్యాంపులో ఇది తొలి కరోనా కేసు.

Read More »

దీపికా పదుకొణెకి కరోనా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కరోనా బారినపడింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పుట్టింట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీపిక కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆమె తండ్రి, మాజీ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు జ్వరం తగ్గకపోవడం వల్ల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat