ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వే తరహా సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సేవలను వాడుకోవాలన్నారు. సెకండ్ వేవ్ గ్రామాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, దీన్ని కట్టడి చేసేలా వ్యూహాలు అమలు చేయాలన్నారు.
Read More »భారత్ లో 3,11,170 కరోనా కేసులు
భారత్ లో గడిచిన గత 24 గంటల్లో 3,11,170 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077గా ఉంది. ఇక నిన్న 4077 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,70,284గా ఉంది. ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి
కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కరోనాతో మరణించారు. ఏప్రిల్ 22న కరోనా బారిన పడ్డ ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. రాహుల్ గాంధీతో సతావ్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు.
Read More »చద్దన్నం తింటే ఉంటది
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చద్దన్నం మంచి మెడిసిన్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని బ్యాక్టీరియా శరీరంలోని హానికర వైరస్లను నాశనం చేస్తుంది. చద్దన్నంలో చాలా రకాల పోషకాలుఉంటాయి. 1. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 2. చర్మవ్యాధుల నుంచి కాపాడుతుంది. 3. మలబద్ధకం, పేగుల్లో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 4. B12, B6 విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. 5. బీపీ కంట్రోల్లో ఉంటుంది.
Read More »రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి బయట మల్కాజీగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కరోనా బాధితుల వెంట వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు లాక్డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 1,000 మంది కడుపు నింపుతామని చెప్పారు. గాంధీ ఆస్పత్రి స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బందికీ అన్నం పెడతామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 32మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.33 శాతంగా ఉంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64,362టెస్టులు చేశారు.
Read More »నేడు రేపు తెలంగాణలో వ్యాక్సిన్ బంద్
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు, రేపు నిలిచిపోనుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిని 12-16 వారాలకు కేంద్రం మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను శని, ఆదివారాల్లో నిలిపివేసింది. ఈ నెల 17 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »త్వరలో 2డీజీ డ్రగ్స్
DRDO భాగస్వామ్యంతో కరోనా బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డా. రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. వచ్చేవారమే 10వేల డోసుల మొదటి బ్యాచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్, DRDO అధికారులు తెలిపారు. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
Read More »ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 4.8 లక్షల కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వ్యాక్సిన్ డోసులు చేరుకోన్నాయి… తొలుత వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు పంపనున్నారు. టీకాల కొరతతో ఇబ్బంది పడుతున్న వేళ.. తాజాగా వచ్చిన టీకాలతో కాస్త ఉపశమనం లభించనుంది.
Read More »