తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేలకు పైనే నమోదవుతున్నాయి. మరో 27 కోవిడ్-19 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 5,186 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 71,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 607, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ 225 కరోనా కేసులు …
Read More »ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం
కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలబడుతున్న హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ సామాన్యులకే కాదు సర్కారులకు సాయం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో 2 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని సోనూ స్నేహితులు తమ జిల్లాకు ఏమైనా సాయం చేయాలని కోరారు. అవసరాలు ఏంటో చెప్పండని కోరగా వారు కలెక్టర్ చక్రధర్ బాబుతో మాట్లాడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ …
Read More »భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు
భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్
కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.
Read More »ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.
Read More »కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్
తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read More »COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ
■ COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ | ■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. > లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. > 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా …
Read More »తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50,969 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 658, రంగారెడ్డి 326, మేడ్చల్ 293, కరోనా కేసులు బయటపడ్డాయి. తెలంగానలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Read More »తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసిన గ్రీన్ కో సంస్థ
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »వీరు గొప్ప మనసు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 51,000 మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరపున వీరూ ఈ సాయం చేస్తున్నాడు.
Read More »