దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్ …
Read More »కేరళలో నిఫా కలకలం..
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్‌లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని …
Read More »దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో …
Read More »న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం
న్యూజిలాండ్‌లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్‌లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి …
Read More »దేశంలో కొత్తగా 42వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 45 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 లక్ష మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇందులో 3,21,00,001 మంది బాధితులు …
Read More »దేశంలో కొత్తగా 47వేల కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరిగాయి. నిన్న 41వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. తాజాగా 47వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో 47,092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 35,181 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 509 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. …
Read More »దేశంలో కొత్తగా 42 వేల కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. నిన్నటికంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, …
Read More »కరోనా థర్డ్ వేవ్ పై ICMR కీలక ప్రకటన
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ గురించి గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాలు వేశారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయాన్ని తెలిపింది. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ కరోనా …
Read More »దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 46 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 45 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా …
Read More »దేశంలో మరోమారు పెరిగిన కరోనా కేసులు
దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైళురాయిని అధిగమించింది. 24 గంటల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు …
Read More »