ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »గుజరాత్ లో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఆ రాష్ట్రంలోని 8 నగరాల్లో రాత్రి పూట నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని గుజరాత్ సర్కారు పేర్కొంది. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా గుజరాత్లో తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో అక్కడ మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య …
Read More »నాదల్ కు కరోనా
స్టార్ టెన్నిస్ ప్లేయర్ నాదల్ కు కరోనా సోకింది. స్పెయిన్లో చేసిన పరీక్షల్లో నాదల్ కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా అబుదాబీలో ఈవెంట్ ముగించుకుని గతవారమే నాదల్ స్పెయిన్ వచ్చాడు.
Read More »మూడు డోసులు వేసుకున్నవారిని వదలని ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ నెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో కరోనా పరీక్ష నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చింది. అయితే అతడు ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాడని, అయినా అతనికి వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు చెప్పారు. బాధితుడు …
Read More »దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,77,158 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. ఇంకా 84,565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 569 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 8706 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో …
Read More »త్వరలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం
త్వరలో మళ్లీ కరోనా ఆంక్షలు విధించకోపోతే యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు శనివారం హెచ్చరించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ఇన్‌ఫెక్షన్ల రేటు చాలా ఎక్కవగా ఉండటంతో ఆస్పత్రులలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ నిక్ డేవీస్ అన్నారు. యూకేలో శనివారం తాజాగా 633 …
Read More »ఒమైక్రాన్ వేరియంట్ ప్రమాదమా.. కాదా..?
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్ కరోనా వైర్‌సను తలచుకొని వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు గత రెండు వేవ్‌ల కరోనా వైరస్ సంక్షోభాన్ని గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే, ఒమైక్రాన్ వేరియంట్ మరీ అంత ప్రమాదకారి కాదని ఇప్పటిదాకా జరిగిన పరిశీలనల్లో వెల్లడవుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మినహా ఏ …
Read More »దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో 3,40,97,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,111 మంది మరణించగా, 94,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది. …
Read More »కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన బిల్ గేట్స్
కోవిడ్ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేశారు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మహమ్మారికి చెందిన తీవ్ర దశ ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఆందోళన పరిస్థితి తప్పదన్నారు. ఈ దశలో మరో సంక్షోభాన్ని అంచనా వేయలేమని, కానీ మహమ్మారికి చెందిన తీవ్ర దశ వచ్చే ఏడాది ముగియనున్నట్లు ఆయన తెలిపారు. గేట్స్ …
Read More »Carona థర్డ్ వేవ్ కి కారణం ఇదే..?
సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న కాలేజీల్లో ఫెస్ట్ లు ఊపందుకున్నాయి. వీటిలో విద్యార్థులెవరూ కనీసం మాస్కులు ధరించకుండా పాల్గొనడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో 280 మందికి కరోనా సోకగా.. తాజాగా కరీంనగర్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో 43 మంది వైరస్ బారిన పడ్డారు. అందుకే విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
Read More »