తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.
Read More »దేశంలో 781 ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 781 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇక తెలంగాణలో 62 కేసులు రాగా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు.
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పై WHO హెచ్చరిక
ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ ఇంకా తీవ్రంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 11% పెరిగాయని పేర్కొంది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు నిరూపితమైందని చెప్పింది. వివిధ దేశాల రిపోర్టులను బట్టి చూస్తే 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయని వివరించింది.
Read More »Tollywood హీరో మంచు మనోజ్ కు కరోనా
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపాడు. “నాకు కరోనా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం నుంచి కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Read More »ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం
ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం రేపింది. ఇంగ్లండ్ బృందంలో 4 కరోనా కేసులు వచ్చాయి. సిబ్బంది కాగా.. మరో వీరిలో సహాయక ఇద్దరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులని తెలిసింది. ఇక, ఆటగాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలిన తర్వాతే.. హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు అనుమతించారు. ఈ నేపథ్యంలో 3వ టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
Read More »అక్కడ ఒక్కరోజే లక్ష కరోనా కేసులు
ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం …
Read More »AP లో 82కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166
Read More »TRS Mp రంజిత్ రెడ్డి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి నిన్న కరోనా నిర్ధారణ అయిన సంగతి తెల్సిందే..ప్రస్తుతం ఆయన హోంఐసోలేషన్లో ఉన్నారు.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృంద ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఎర్రబెల్లి, రంజిత్ రెడ్డికి పాజిటివ్ రావడంతో అధికార పార్టీ …
Read More »తెలంగాణలో మరో 3ఒమిక్రాన్ కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4450 పెరిగింది. ఇప్పటివరకు 10 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు పేర్కొన్నారు.
Read More »మంత్రి ఎర్రబెల్లి కి కరోనా
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »