Home / Tag Archives: carona negative (page 24)

Tag Archives: carona negative

వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.

Read More »

దాదాకు డెల్టా ప్లస్ కరోనా

టీమిండియా లెజండ్రీ ఆటగాడు,బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. 2 రోజుల కిందట సేకరించిన శాంపిల్స్లో దాదాకు తాజాగా డెల్టా ప్లస్ నిర్ధారణ అయ్యింది. కాగా.. కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులుగా దాదా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాడు. గంగూలీని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Read More »

తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి మరో 232 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28,886 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వీరిలో 27మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Read More »

విమానంలో ప్రయాణం – మధ్యలో కరోనా అని తేల్సింది..?

USAకు చెందిన మరిసా ఫొటియో అనే మహిళ షికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానం ఎక్కింది. గొంతు నొప్పిగా ఉండటంతో.. బాత్రూంకు వెళ్లి స్వయంగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అటెండెంట్కు విషయం చెప్పి.. విమానం ల్యాండ్ అయ్యేవరకు 3గంటల పాటు బాత్రూంలో ఐసోలేషన్లో గడిపింది. గత నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా.. తోటి ప్రయాణికులకు కరోనా సోకకుండా ఆమె …

Read More »

ఆ వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా వాడోచ్చు..!

హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు (పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగులు) జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, 60 ఏళ్లు దాటిన వారూ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు  .. ఇందుకోసం రెండు డోసులు పొంది 9 నెలలు పూర్తికావాలి. ఇంతకుముందు ఏ వ్యాక్సిన్ పొందారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా ఇస్తారు. ఇందుకోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Read More »

ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు

ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 17కు చేరింది. UAE నుంచి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగి ప్రకాశం జిల్లాకు వచ్చిన 52 ఏళ్ల మహిళకు డిసెంబర్ 24న కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె నమూనాలను HYD సీసీఎంబీలో పరిశీలించగా.. ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న 14 మందికి కరోనా టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు.

Read More »

ముంబైలో కరోనా కలవరం

ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 5,428 కోత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల 2,510 అధికం. అటు మహారాష్ట్రవ్యాప్తంగా 8,067 కేసులు నమోదయ్యాయి. 8 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

Read More »

తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,759 టెస్టులు చేయగా.. 311 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కు చేరాయి. .. గడిచిన 24 గంటల్లో 222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 159 మందికి టెస్టులు చేయగా.. 7 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.

Read More »

UKలో కరోనా కలవరం

UKలో గత 24 గంటల్లో 1,29,471 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఒక్కరోజే 18 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,48,021కి చేరుకుంది. కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమని తెలుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat