దేశంలో రోజు రోజుకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదయింది. రాజస్థాన్లో ఒమిక్రాన్ సోకిన 72ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బాధితుడు ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు రాగా.. అది ఒమిక్రాన్ మరణం కాదని తేలింది.
Read More »మీనా కుటుంబంలో కరోనా కలవరం
ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతూగిలించిన మోస్ట్ బ్యూటీఫుల్ లేడీ..అలనాటి హీరోయిన్ మీనా ఇంట్లో కరోనా ఆందోళన నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మీనా స్వయంగా వెల్లడించింది. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటికి అతిథిగా కరోనా వచ్చింది. దానికి మా కుటుంబం బాగా నచ్చింది. అయితే.. దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా కేర్ఫుల్గా ఉండండి. కరోనా జాగ్రత్తలు పాటించండి’ …
Read More »మెస్సీకి కరోనా
ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీకి కరోనా సోకింది. ఆయనతో పాటు జట్టులోని మరో ముగ్గురు ఆటగాళ్లు, సిబ్బందిలో ఒకరికి కోవిడ్ సోకిందని మెస్సీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ వెల్లడించింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నారు. ఫ్రెంచ్ కప్లో భాగంగా సోమవారం PSG తరఫున మెస్సీ మ్యాచ్ ఉంది.
Read More »15-18 ఏళ్లవారికి కోవాగ్జిన్ మాత్రమే
కరోనా కట్టడీలో భాగంగా దేశ వ్యాప్తంగా రేపటి నుంచి 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాష్ట్రాలకు పలు జాగ్రత్తలను సూచించారు. ఆ వయసు వారికి కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉందని, అందువల్ల వేర్వేరు టీకాలు కలవకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ కట్టడికి ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో జనవరి 5-19 మధ్య వెబినార్లను నిర్వహిస్తామన్నారు.
Read More »గ్లెన్ మెక్ గ్రాత్ కి కరోనా
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వరుడ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది. క్యాన్సర్ బాధితుల కోసం రాబోయే టెస్టులో గ్లెన్ మెక్ గ్రాత్ ఫండ్ రైజింగ్ డ్రైవ్ తలపెట్టాడు. కరోనా సోకడంతో ప్రస్తుతం గ్లెన్ మెక్ …
Read More »ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా
ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ధ్రువీకరించారు. గత ఏడాది కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
Read More »ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కరోనా కేసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి. బెంగాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. 6,153 …
Read More »15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేయగా.. కొవిన్ యాప్, పోర్టల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. వ్యాక్సిన్ కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాలకు వీరికి రెండో డోసు ఇస్తారు. కాగా ప్రస్తుతం ఈ వయసు వారికి కొవాగ్జిన్ టీకా ఒక్కటే అందుబాటులో ఉంది.
Read More »15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొవిన్ యాప్ లేదా వెబ్సైటులో ఫోన్ నెంబర్ ఇస్తే.. ఆ తర్వాత వచ్చిన OTPని వెరిఫై చేయాలి. ఒక ఫోన్ నెంబర్ తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ” ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి ” ఆధార్ నెంబర్ లేదా టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు ” ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ …
Read More »కొవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలురాయి
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా …
Read More »