తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »